ప్రజలు తమ సమస్యల కోసం అనేక మార్గాల్లో నిరసన తెలుపుతుంటారు. కొందరు ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయిస్తే.. మరికొందరు ర్యాలీలు చేస్తూ నిరసన తెలియజేస్తారు. అయితే తెలంగాణలో ఓ టీచర్ తన రక్తాన్ని ధారబోసి ఆశ్చర్యకర రీతిలో నిరసన తెలియజేసింది. ఉద్యోగ భద్రత, రెగ్యులైజేషన్ చేయాలని నిరసన వ్యక్తం చేస్తూ నాగర్కర్నూల్-కోడేరు కస్తూర్బాగాంధీ టీచర్ గోపిలత సీఎం కేసీఆర్ చిత్రపటానికి రక్తాభిషేకం చేసింది. ఆమె తీరుపై పలువురు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ శర్మన్ ఆమెపై చర్యలు తీసుకున్నారు. తమ అనుమతి లేకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిందని ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా..
ఆమెను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఆమె ను తొలగించడం అన్యాయం...
ReplyDeleteచేతనైతే ఆమె సమస్య ను పరిష్కరించాలి కానీ, విధుల నుంచి తొలగించడం పూర్తిగా అన్యాయం..
మాట ఇచ్చి తప్పడం పాలకుల తప్పు..
Deleteపాలకులను నిందించకుండా,బాధితులను బాధించడం ముమ్మాటికీ ప్రభుత్వ తప్పే..