జేఈఈ మెయిన్ లో మనోళ్లే టాపర్లు
న్యూఢిల్లీ: జేఈఈ ఫలితాల్లో మనోళ్లు మరోసారి సత్తా చాటారు. మెయిన్ పరీక్షల్లో వంద శాతం మార్కులతో టాపర్లుగా నిలిచారు. మొత్తం 13 మంది వంద పర్సంటైల్ సాధించగా.. అందులో మన రాష్ట్రానికి చెందిన వాళ్లే ముగ్గురు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బన్నూరు రోహిత్ కుమార్ రెడ్డి ఇందులో టాపర్లుగా నిలిచారు. టాప్ టెన్ లో మాదుర్ ఆదర్శ్ రెడ్డి నిలవగా.. వంద పర్సెంటైల్ సాధించిన పదమూడు మందిలో జోస్యుల వెంకట ఆదిత్య కూడా ఉన్నారు. ఈమేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) బుధవారం జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు దేశవిదేశాల్లోని 6 లక్షల 19 వేల 638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
0 comments:
Post a comment