📚✍రిటైర్డ్ ఉద్యోగులకు షాక్
♦ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో పెన్షన్ లో కోత
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మార్చి నెలలో ఫించన్ అందుకున్న పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ లో కోత విధించింది. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ కోత పెట్టేసిం ది. అయితే, భారీగా కోత పడడంపై రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. కాగా ఆదాయపన్ను నిమిత్తం ప్రతీ ఏడాది ఇలాంటి కోత ఉంటుందని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు సేవింగ్స్ క్లెయి మ్స్ ఇవ్వకపోవడం వల్ల కోత విధింపు ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. కానీ సేవింగ్స్ కు సంబంధించిన క్లెయిమ్ లను పంపినా.. తమకు చేరలేదంటూ ట్రెజరీ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రిటైర్డ్ ఉద్యోగులు ఆరోపిస్తున్నా రు. ఇంకా జమ చేయని డీఏ బకాయిలను కూడా కలిపేసి ఇన్కమ్ టాక్స్ లెక్కలు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అదేమని అడిగితే రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని రిటైర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
UP Police Recruitment 2021 Government Jobs for Fresher and Experienced.ghuf
ReplyDelete