📙✍నేడు, రేపు బ్యాంకుల సమ్మె🔸బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం
🌷న్యూఢిల్లీ, మార్చి 14.* ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సోమ, మంగళవారాల్లో సమ్మెకు దిగనున్నారు. రెండు ప్రభు త్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకుల శాఖల్లో డిపాజిట్లు, విత్ డ్రాయల్ వంటి సేవలతోపాటు చెక్ క్లియరెన్స్, రుణ అనుమ తులపై ప్రభావం పడనుంది. సమ్మెలో దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు పాల్గొననున్నట్టు తొమ్మిది యూనియన్లతో కూడిన యూఎఫ్బీయూ ఒక ప్రక టనలో పేర్కొంది. సమ్మె కారణంగా శాఖలు, కార్యాలయాల్లో తమ సాధారణ కార్యకలాపాలపై ప్రభావం పడనుందని ఎస్బీఐ సహా పలు ప్రభుత్వరంగ బ్యాంకులు తమ కస్టమ ర్లకు సమాచారం అందించాయి.
0 comments:
Post a comment