ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా పట్టభద్రులైన ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ప్రభావితం చేసేందుకు, ప్రలోభ పెట్టేందుకు.. టీఎన్జీవో, టీజీవో, పీఆర్టీయూ నేతలు ప్రింట్ మీడియాకు, ఎలకా్ట్రనిక్ మీడియాకు ప్రకటన ఇచ్చినట్టు కనపడుతోంది. ఇది ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధం.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇచ్చిన షోకాజ్‌లో ఈసీ
'''ఎన్నికల నిబంధన అమలులో ఉన్నందున నేనివాళ అమలు చేయలేకపోయిన. తప్పకుండా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మరి ఉద్యోగులవిగానీ, ఉపాధ్యాయులవిగానీ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన అన్ని సమస్యలూ పరిష్కరిస్తాన'న్నారు.
ఆంధ్రాలో ఇచ్చిన దానికంటే ఎక్కువ శాతాన్ని తప్పకుండా తెలంగాణ ఉద్యోగులకు ఈ (ఎన్నికల) కోడ్ అమలు అయిపోగానే ఇస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిగారు మాకు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది.''
ఈ నెల 9న సీఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలపై టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చేసిన ప్రకటన
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ.. సీఎం తమకు ఇచ్చిన హామీలపై టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చేసిన ప్రకటన పట్టభద్రులను, అందునా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభావితం చేసేలా ఉందని ఎన్నికల కమిషన్ అభిప్రాయపడింది. ''ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు'' అంటూ ఉద్యోగ సంఘాలకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 9న సీఎంతో భేటీ అనంతరం.. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 29ు ఫిట్మెంట్, రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంపు, ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై పత్రికల్లో వచ్చిన క్లిపింగ్‌లు, చానళ్లలో వచ్చిన వీడియోలతో.. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారితో పాటు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆల ప్రియాంక షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసు అందిన 24 గంటల్లోగా సంతకాలు చేసి, లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు.
టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు కె.రవీందర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీపాల్‌రెడ్డి, బి.కమలాకర్‌రావుకు షోకాజ్ నోటీసులు అం దాయి. అందరూ షోకాజు నోటీసుకు జవాబు ఇచ్చారుగానీ.. అందులో ఏం పేర్కొన్నదీ తెలియరాలేదు. కాగా.. ఉద్యోగ సంఘాల ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదుల్లో ఎక్కడా కూడా సంఘాల ప్రతినిధుల పేర్లు లేకపోవడం తమకు కలిసొచ్చే అంశమని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాము కలువనే లేదని.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను మభ్యపెట్టే అవకాశ మే లేదని, ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూనే ఉంటామని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. కొందరేమో కలిశామని చెబుతున్నారు. కానీ.. మామిళ్ల రాజేందర్ మీడియాతో మాట్లాడిన వీడియోలో ఆ విషయం స్పష్టంగా ఉంది. సీఎం తమకు హామీ ఇచ్చినట్టు అందులో ఆయన విస్పష్టంగా తెలిపారు. మరి ఈ అంశంపై ఈసీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
0 comments:
Post a comment