ప్రభుత్వ రంగ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) తమ పాలసీదారులకు శుభవార్తను అందించింది. కరోనా కారణంగా క్లెయిమ్ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో ముందడుగు వేసింది. మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్ఐసీ కార్యాలయాల్లోనే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ అవకాశం కేవలం ఈ నెలాఖరు వరకే ఉంటుందని స్పష్టం చేసింది. పాలసీ క్లెయిమ్ కోసం ఆయా పాలసీదారులు తమ సమీప ఎల్ఐసీ కార్యాలయాన్ని సందర్శించి డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేయాలని ఎల్ఐసి తెలిపింది. పాలసీదారుడు తన సర్వీసింగ్ బ్రాంచ్‌తో సంబంధం లేకుండా ఏ సమీప బ్రాంచ్ నుంచైనా మెచ్యూరిటీ క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఎల్ఐసీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న113 డివిజనల్ ఆఫీసులు, 2,048 బ్రాంచులు, 1,526 శాటిలైట్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్లలో ఈ సర్వీసులను పొందవచ్చని స్పష్టం చేసింది.
అయితే.. పాలసీదారుడు ఎక్కడ దరఖాస్తు చేసినా సరే.. క్లెయిమ్ చెల్లింపును మాత్రం సంబంధిత సర్వీసింగ్ బ్రాంచ్ మాత్రమే ప్రాసెస్ చేస్తుందని పేర్కొంది. మొదట పాలసీదారుడు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ను ఆన్లైన్ ద్వారా సంబంధిత సర్వీసింగ్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తుంది. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత అధికారులకు ప్రత్యేక అధికారం ఉంటుందని ఎల్ఐసీ తెలిపింది. పాలసీదారుడి సర్వీసింగ్ బ్రాంచ్ ఒక నగరంలో ఉండి అతడు వేరొక నగరంలో ఉన్నా సరే పాలసీ క్లెయిమ్ కోసం సమీప బ్రాంచ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కాగా, ఎల్ఐసీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29 కోట్లకు పైగా పాలసీలను అందిస్తోంది.
కాగా, ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకొచ్చే ఎల్ఐసీ.. తాజాగా బచత్ ప్లస్ పేరిట కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. పాలసీదారుడికి బీమా రక్షణతో పాటు పొదుపు కోసం దీన్ని రూపొందించింది. ఐదేళ్ల మెచ్యూరిటీ కాలపరిమితితో వచ్చే ఈ ప్లాన్‌లో చేరిన పాలసీదారుడు హఠాత్తుగా మరణిస్తే, అతని కుటుంబానికి రెండు విధాలుగా పరిహారం చెల్లిస్తుంది. పాలసీ అమల్లో ఉన్న ఐదేళ్లలో మరణిస్తే.. నిబంధనల ప్రకారం ఒకేసారి పాలసీ విలువను చెల్లిస్తారు.
ఆ తర్వాత మరణిస్తే.. అతని కుటుంబానికి పరిహారంతో పాటు లాయల్టీని కలిపి అందజేస్తారు. ఈ ప్లాన్‌లో చేరిన పాలసీదారుడు సింగిల్ ప్రీమియం విధానంలో ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా ఐదేళ్ల పాటు వాయిదాల్లో చెల్లించవచ్చు. పాలసీదారుడు 80సీ కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. ఈ పాలసీని ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ లేదా ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
0 comments:
Post a comment