అనంతపురం జిల్లా ఉపాధ్యాయుడి "డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతరత్న అవార్డు, నేషనల్ సేవా రత్న , నేషనల్ ఉత్తమ ఉపాధ్యాయులు" అవార్డులు ప్రధానం చేసిన : వల్లూరి ఫౌండేషన్
21వ తేదీ ఆదివారం నాడు వల్లూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి అవార్డులు అందజేయడం జరిగింది అని వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ వి.ఆర్ శ్రీనివాస్ తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి ఓబులదేవరచెరువు మండలం కమ్మవారి పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు గౌస్ లాజమ్ ను "డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డు 2020 "నేషనల్ సేవా రత్న అవార్డు2021, నేషనల్ ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు2021
ఇవ్వడం జరిగింది అని వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ వి.ఆర్.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత మాట్లాడుతూ సేవ చేసే వారి కంటే సేవ చేసే వారిని గుర్తించడం చాలా గొప్ప విషయం అని, నన్ను ఎంపిక చేసిన చైర్మన్ గారికి ,జ్యురీ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవార్డుతో నా మీద మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.అవార్డు గ్రహీత కు మండల విద్యాశాఖాధికారి, మండల ఉపాధ్యాయులు అభినందించారు.
0 comments:
Post a comment