📙✍త్వరలో ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్
🔸ఏపీజీఈఎఫ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి
🌷అమరావతి, ఆంధ్రప్రభ :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో మెరుగైన ఫిట్ మెంట్ ను ప్రభుత్వం ప్రకటించటంతో పాటు పీఆర్ సీని అమలు చేస్తుందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగు లకు 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించటానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలే కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 27 శాతం మధ్యంత భృతిని అమలు చేస్తోందని ఈ విధంగా తెలంగాణ ఉద్యోగులకు కూడా సీఎం జగన్ మేలు చేసినట్లయిందన్నారు. తెలంగాణ పీఆర్సీ కమిషన్ కేవలం 7.5 శాతం మాత్రమే ఫిట్మెంట్ రికమెండ్ చేసిందని అయితే ఏపీలో ఐఆర్ 27 శాతం అమల్లో ఉన్నందునే టీఎస్ సర్కార్ 30 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. దీన్నిబట్టి భవిష్యత్ లో ప్రభుత్వం ప్రకటించే పీఆర్సీ ఫిట్మెంట్ ఉద్యోగులకు ఊరట కలిగించగలదని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
0 comments:
Post a comment