ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం తరువాత ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికలపై దృష్టి సారించింది. గతేడాది ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది ఎస్ఈసి. అయితే, నోటిఫికేషన్ తరువాత అనేక చోట్ల ఎంపిటిసిలు, జెడ్పిటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, బలవంతంగా ఏకగ్రీవాలు జరిగాయని, బలవంతపు ఏకగ్రీవాలను ఆమోదించవద్దని ఎస్ఈసి ఆదేశించింది. అయితే, దీనిపై వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఎస్ఈసి ఆదేశాలను కొట్టివేసింది. ఏకగ్రీవాలను ఆమోదించాలని హైకోర్టు ఎస్ఈసిని ఆదేశించింది.
0 comments:
Post a comment