📚✍విద్యా, వసతి దీవెనలు వర్తించవా?
♦డిగ్రీ స్పాట్ ప్రవేశాలపై మెలిక
🌻న్యూస్‌టుడే, అమరావతి ఫీచర్స్:
డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఉన్నత విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 11వ తేదీ నుంచి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజే మహాశివరాత్రి రావడంతో శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఆరంభమవ్వనున్నాయి. 20వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయకుండానే కోరుకున్నచోట విద్యార్థులు ప్రవేశాల్ని పొందవచ్ఛు అంతవరకు బాగానే ఉన్నా స్పాట్ అడ్మిషన్ల ద్వారా కళాశాలల్లో చేరే విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన.. వసతి దీవెన వర్తించదని ప్రభుత్వం పేర్కొనడమే సమస్యగా మారింది. మొత్తం సీట్లకు సగమే భర్తీ అయిన పరిస్థితుల్లో వేల మందికి ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు దూరం చేయడం ఆందోళన కలిగిస్తోంది.
కొవిడ్‌తో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో జాప్యం చోటుచేసుకుంది. దీనికితోడు ఆన్‌లైన్ పద్ధతిలో తొలిసారి ప్రవేశాల ప్రక్రియ చేపట్టారు. ఇంజినీరింగ్ విద్యార్థుల తరహాలోనే మార్కులు, సామాజిక వర్గాల ఆధారంగా కళాశాలల్ని కేటాయించారు. దీంతో కేటగిరి-1 కళాశాలల్లో చేరేందుకు ఎక్కువ మంది పోటీపడ్డారు. నాణ్యమైన విద్యాబోధనతో పాటు వసతి అవకాశం ఉన్న వాటికి ఆప్షన్ ఇచ్చారు. ప్రతిభ ఆధారంగా కేటాయింపులు చేపట్టడంతో చాలా మందికి కోరుకున్నచోట సీట్లు దక్కలేదు. రెండు విడతల ఆన్‌లైన్ ప్రవేశాల పట్ల వేల మంది విద్యార్థులు ఆసక్తి చూపించలేదని ఇంకా మిగిలిపోయిన సీట్లను చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. తాజా షెడ్యూలు ప్రకారం 20వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా స్పాట్ అడ్మిషన్లు పొందవచ్ఛు రూ.100 అపరాధ రుసుంతో 21, 22 తేదీలు.. రూ.2 వేలు అపరాధ రుసుంతో 23వ తేదీ నుంచి 31 వరకు.. రూ.50 వేల అపరాధ రుసుంతో వచ్చే నెల 1వ తేదీ నుంచి 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. విద్యాదీవెన.. వసతి దీవెన లబ్ధిలేని పరిస్థితుల్లో సొంత నగదు వెచ్చించి చదువుకునేందుకు ఎంత మంది ముందుకొస్తారనే చర్చ నడుస్తోంది.
0 Comments:
Post a Comment