ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ కాసేపట్లో సమావేశం కానుంది.. ఏపీఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసులను.. కాకాని గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ విచారించనుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డను వివరణ అడిగే దిశగా కమిటీ చర్చించే అవకాశం ఉంది. అనంతరం ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక, నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి మరోసారి ఫిర్యాదు చేశారు మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి.. కాగా, ఏపీలో పంచాయతీ ఎన్నికల సమయంలో.. మంత్రులకు ఎస్ఈసీ నోటీసులు ఇవ్వడం, ఆంక్షలు విధించడంపై మంత్రులు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a comment