మహిళా వినియోగదారులకు శుభవార్త
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మహిళా రుణగ్రహీతలకు గృహ రుణ రేట్లపై వడ్డీపై మరింత తగ్గింపును ప్రకటించింది. మహిళా దినోత్సవం రోజున, మహిళా రుణగ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల అదనపు రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది, 6.70 శాతం నుంచి ప్రారంభం కానున్న వడ్డీ రేట్లపై ఇది వర్తిస్తుంది.
మార్చి 1 న ఎస్బీఐ గృహ రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లతో బ్యాంక్ ఇప్పుడు 70 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు వడ్డీ రాయితీని అందిస్తుంది. ఇది మార్చి 31 తో ముగిసే పరిమిత కాల ఆఫర్. ప్రాసెసింగ్ ఫీజు కూడా బ్యాంకు 100 శాతం రద్దు చేసింది.
వడ్డీ రాయితీ రుణ మొత్తం, సిబిల్ స్కోరుపై ఆధారపడి ఉంటుంది. మంచి క్రెడిట్ చరిత్రను కలిగి ఉంటే వినియోగదారులకు మెరుగైన రేట్లు అందించడం చాలా ముఖ్యం అని ఎస్బీఐ అభిప్రాయపడింది. ఎస్బీఐ వినియోగదారుల కోసం వివిధ గృహ రుణాలను అందిస్తుంది.
ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లు సిబిల్ స్కోరుతో అనుసంధానమై ఉంటాయి, రూ. 75 లక్షల వరకు ఉన్న రుణాలకు 6.70 శాతం నుంచి నుంచి రూ. 75 లక్షలకు పైబడిన రుణాలకు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతాయి.
5 బీపీఎస్ అదనపు వడ్డీ రాయితీ పొందడానికి వినియోగదారులు తమ ఇంటి నుంచే యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 2021 లో, ఎస్బీఐ తన గృహ రుణ వ్యాపారంలో రూ. 5 ట్రిలియన్ (5 లక్షల కోట్లు) మార్కును దాటి మరో మైలురాయిని చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 7 ట్రిలియన్ డాలర్ల గృహ రుణాలను అందించడంపై బ్యాంక్ దృష్టి సారించింది.
ఐసిఐసిఐ బ్యాంక్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డిఎఫ్సి), కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ఇతర రుణదాతలు కూడా గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాయి.
0 comments:
Post a comment