ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయాలు- గ్రామాల్లో కోడ్ ఎత్తివేత- మేయర్ ఎన్నికలకు ఏర్పాట్లు
ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగియడంతో తర్వాతి ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టిసారించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను తొలగించింది. అలాగే కార్పోరేషన్లలో మేయర్, డిప్యూటీ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ గత నెలలోనే ముగిసింది. అయితే కొన్ని చోట్ల ఎన్నికలు పెండింగ్‌లో ఉండటం, పలు వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ను మాత్రం ఎస్ఈసీ తొలగించలేదు. ఎట్టకేలకు ఇవాళ పంచాయతీ ఎన్నికలు ముగిసిన గ్రామాల్లో ఎన్నికల కోడ్ ఎత్తేస్తే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు ఇచ్చారు.
0 Comments:
Post a Comment