Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Sunday, 7 March 2021

Betel Leaf: ఆరోగ్యానికి సంజీవని.. తమలపాకు.. రోజూ తింటే ఈ రోగాలన్నీ మటుమాయం..

 Betel Leaf: ఆరోగ్యానికి సంజీవని.. తమలపాకు.. రోజూ తింటే ఈ రోగాలన్నీ మటుమాయం..


Benefits of Betel Leaves: ఆధునిక ప్రపంచంలో అందరూ పలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మన జీవనశైలి, ఆహారం ప్రభావితం చేస్తున్నాయి. ఉరుకులు పరుగుల జీవితం వలన చిన్న సమస్యలు పెద్దగా మారేంత వరకూ కూడా మనం వాటిపై దృష్టి సారించడంలేదు. కానీ కొన్ని సమస్యలను మన ఇంట్లోనే పరిష్కారం చూపే ఔషధాలు ఉన్నా.. చాలామంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను ఇట్టే నయం చేసుకోవచ్చు. అలాంటి ఔషధాల్లో తమలపాకులు ఒకటి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్‌ సీ, పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఆకలి నుంచి.. అరుగుదల వరకు.. అనారోగ్య సమస్యలకు ఈ తమలపాకులు సంజీవనిలా ఉపయోగపడతాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..

ఆకలి కోసం..

ఆకలి అనిపించనప్పుడు.. నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


కడుపు ఉబ్బరం..

కడుపు ఉబ్బరంగా ఉంటే.. రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటికలో తగ్గిపోతుంది. ఇలాచేస్తే.. వెంటనే ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.


మైగ్రెన్‌, తలనొప్పికి దివ్య ఔషధం.. :

తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ తమలపాకులు దివ్య ఔషధంలా పని చేస్తాయి. తరచూ ఋ సమస్య వేధిస్తుంటే.. నుదుటి మీద తమలపాకులను రాయడం కానీ.. లేకపోతే.. తమలపాకుల రసంతో కాసేపు మసాజ్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది.


డిప్రెషన్ నుంచి ఉపశమనం..

ప్రతిరోజూ తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు..


జీర్ణ ప్రక్రియకు..

అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. జీర్ణప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్స్ ను ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తుంది.


నొప్పులకు..

ఎప్పుడైనా చిన్న గాయాలు కానీ వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచాలి. వీటి రసంతో మసాజ్‌ చేస్తే నొప్పులు కూడా తగ్గుతాయి.


దగ్గు, జలుబు..

తమలపాకులు తినడం వల్ల కఫం రాదు. రోజూ తమలపాకులను తినడం ద్వారా దగ్గు, జలుబు సమస్యలకు కళ్లెం వేయవచ్చు.

0 Comments:

Post a Comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top