Benefits of Speed Walking
Raises your heart rate to a higher heart rate zone. ...
Improves weight loss efforts (with increased calorie burn) and increases fitness and endurance.
Increases flexibility of your muscles and joints depending on your walking pattern and your starting point. ...
Strengthens muscles especially your leg and abdominal muscles.
నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీన్ని సులభమైన వ్యాయామాల్లో ఒకటిగా పేర్కొంటారు వైద్య నిపుణులు. రోజూ వాకింగ్ చేస్తే ఎన్నో రోగాలు నయమవుతాయని, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే, వేగంగా నడవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలున్నాయని వారు చెబుతున్నారు. దీని ద్వారా శరీరంలో అధికంగా కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. వాస్తవానికి, వేగవంతమైన నడక చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వేగవంతమైన నడక మనకు అస్సలు విసుకు తెప్పించదు. దీర్ఘకాలంలో మరిన్ని వ్యాయామం ప్రయోజనాలను పొందడానికి, అనారోగ్య సమస్యలను నివారించడానికి వేగవంతమైన నడక ఉత్తమ మార్గమని చెప్పవచ్చు. అంతేకాక, ఇది మానసిక, శారీరక దీర్ఘాయువునిస్తుంది.
తద్వారా, మెరుగైన ఆరోగ్యానికి గణనీయంగా సహాయపడుతుంది. వేగవంతమైన నడకతో కలిగే ప్రయోజనాలను చూద్దాం.
వేగవంతమైన నడకను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా మీ శరీరం మరింత దృఢంగా తయారవుతుంది. వేగంగా కండరాలను కదిలించడం ద్వారా మీ కండరాలకు బలం చేకూరుతుంది. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న వారికి వేగంగా నడవడం కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది రక్త ప్రసరణను పెంచడంలో కూడా సహాయపడుతుంది.
: బ్రిస్క్ వాక్ కి ముందు క్వాలిటీ గల ఫుట్‌వేర్‌ను ధరించండి. ఒకవేళ మీరు గట్టి నేటిపై నడిచే సందర్భంలో మీకు ఎటువంటి కీళ్ల నొప్పులు రాకుండా ఈ ఫుట్‌వేర్ మిమ్మల్ని రక్షిస్తుంది.
మీరు వేగంగా నడవడానికి, మీ శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. వేగంగా నడవడం ద్వారా మీ శరీర జీవక్రియను మెరుగుపడుతుంది. మీ శరీర బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఇది మీ శరీరంలో జీర్ణక్రియను కూడా ప్రేరేపిస్తుంది. దీనివల్ల మీ ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. మీ శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి పొట్ట వద్ద కొవ్వును తగ్గిస్తుంది.
మీరు నడుస్తున్నప్పుడు క్రమంగా వేగం పెంచండి.
విరామం లేకుండా పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం అనేవి హార్మోన్ల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. కార్టిసాల్ వంటి ఒత్తిడి కలుగజేసే హార్మోన్లను తగ్గించడమే కాకుండా, ఎండార్ఫిన్లు, హార్మోన్లను కూడా ఉత్పత్తి చేస్తుంది. ఎండోర్ఫిన్లు కూడా శరీరంలో సానుకూల అనుభూతిని కలిగిస్తాయి. పిసిఓడి వంటి హార్మోన్ల అసమతౌల్యత కారణంగా ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ వేగవంతమైన నడక సహాయపడుతుంది.
దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హెచ్ఐఐటీ ప్రయత్నించండి.
వేగవంతమైన నడక ద్వారా మీరు క్యాలరీల రూపంలో ఎక్కువ శక్తిని బర్న్ చేస్తారు. ఇది మీ కండరాల శక్తిని పెంచుతుంది. తద్వారా మీ శరీర బరువును నియంత్రిస్తుంది. మీ వయస్సుకు తగ్గట్లు శరీర బరువు ఉండేలా చేస్తుంది. ఏదైనా అదనపు కొవ్వు తగ్గించడానికి నడక చాలా సహాయపడుతుంది. అంతేకాక, నడుము చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి, గుండె వేగంగా కొట్టుకోవడానికి బ్రిస్క్ వాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నడక సమయంలో గట్టిగా ఊపిరి పీల్చుకోవడం ద్వారా మీ కొవ్వు కరుగుతుంది. ఇది మీ కేలరీలను వేగంగా కోల్పోవటానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం మీ శరీరానికి సరైన పోషక వనరులు అందిస్తుంది. అందువల్ల, సరైన శరీర బరువు కోసం మంచి క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోండి.
వేగవంతమైన నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీకు శారీరక వ్యాయామంగా పనిచేస్తుంది. అంతేకాక, మీ గుండెకు ఆరోగ్యం చేకూర్చుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. డయాబెటిస్ నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. మీ కండరాలలోని కణాలు శక్తిని పొందటానికి బాగా పనిచేస్తుంది. అంతేకాక, రక్తపోటును నియంత్రించడం, మెరుగైన రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రసరణ, సమతుల్య కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ వంటి ప్రయోజనాలను చేకూర్చుతుంది.
నడక సమయంలో మీ హృదయ స్పందన రేటును తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ గుండె నిమిషానికి 110- నుంచి 120 బీట్స్ (బిపిఎం) కొట్టుకుంటుందని నిర్థారించుకోండి.
మీ రోజును నడకతో ప్రారంభించడం ద్వారా ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. నడక అనేది మీకు రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది. దీంతో మెరుగ్గా పనిలో రాణించగలుగుతారు. వ్యాయామం వ్యక్తికి మరింత శక్తినిచ్చేలా సహాయపడుతుంది.
చిరుతిళ్లు, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను సాధ్యమైనంత వరకు తీసుకోకండి. ఇవి మీ నడకపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి.
బ్రిస్క్ వాక్ ద్వారా శారీరకంగానే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మన ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న హార్మోన్లు మెరుగైన ఆరోగ్యం కోసం దోహదం చేస్తాయి. మీరు నడక ప్రారంభించన మొదటి రోజు నుండే ఈ ప్రయోజనాలను స్పష్టంగా గమనించవచ్చు. ప్రతిరోజూ ఒక నడక మీ ఆత్మగౌరవాన్ని, మానసిక దృఢత్వాన్ని రెట్టింపు చేస్తుంది. అంతేకాక, మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.
నడక సమయంలో ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించండి. నడుస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై పూర్తిగా దృష్టి పెట్టండి.
బ్రిస్క్ వాక్ మిగిలిన అన్ని వ్యాయామాల కంటే అత్యంత అనుకూలమైన వ్యాయామం. అంతేకాక, అన్ని వయసుల వారు దీన్ని సులభంగా చేయవచ్చు.
తక్కువ దూరాలకు కూడా వాహనాలను వినియోగించకుండా నడవడానికి ప్రయత్నించండి.
0 comments:
Post a comment