శ్రీనగర్: 2021 అమర్‌నాథ్ యాత్ర జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది. జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ గుహల్లో కొలువైన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా జరిగే అమర్‌నాథ్ యాత్ర ఈ యేడాది 56 రోజుల పాటు కొనసాగనుంది. ఆగస్ట్ 22న ఈ యాత్ర ముగియనుంది. ఈ మేరకు ఇవాళ సమావేశమైన అమర్‌నాథ్‌జీ ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని 40వ బోర్డు సమావేశం జరిగింది. కాగా ఏప్రిల్ 1 నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే హారతి కార్యక్రమాన్ని ఆలయ బోర్డు లైవ్ టెలీకాస్ట్ చేయనుంది. 3,800 మీటర్ల ఎత్తులోని ఈ గుహవద్దకు కోవిడ్-19 ప్రొటోకాల్‌ను అనుసరించి యాత్ర కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
0 Comments:
Post a Comment