AICTE: భారతీయ భాషల్లో సాంకేతిక విద్యను అందించాలన్న నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యానికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచే ఇంజినీరింగ్ కోసం గణితం, భౌతిక శాస్త్రం తప్పనిసరి కాదని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. అయితే ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి బీఈ మరియు బిటెక్ కోర్సులకు ప్రవేశం పొందడానికి 12వ తరగతి గణితం, భౌతిక శాస్త్రాన్ని ఐచ్ఛికం చేసింది. అయితే 2022 నుంచి ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి పదో తరగతి స్థాయి గణిత, భౌతిక శాస్త్రాలను తప్పనిసరి చేసింది. అయితే ఏఐసీటీఈ విడుదల చేసిన 2021-22కు ప్రవేశాలకు అర్హత ప్రమాణాలను మార్చింది.
ఇంజనీరింగ్ కోర్సుకు గణితం, భౌతిక శాస్త్రాలు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అయితే అన్ని ఇంజనీరింగ్ డిగ్రీలకు గణితం ఒకప్పుడు పునాది అని చెప్పిన విద్యావేత్తల నుంచి విమర్శలు వచ్చాయి. ఇంజనీరింగ్ కోసం ఏఐసీటీసీ యొక్క మోడల్ పాఠ్యప్రమాణానికి దాదాపు అన్ని ప్రోగ్రామ్‌లలో గణితం ఐదో సెమిస్టర్ వరకు కొనసాగుతుంది. అలాగే అన్ని బ్రాంచీల్లో కాకుండా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీఈ తదితర ఇంజనీరింగ్ బ్రాంచీల్లో మాత్రమే మాతృభాషలో బీటెక్‌ను బోధించేందుకు అనుమతి ఇవ్వనుంది.
అయితే నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) గుర్తింపు పొందిన బ్రాంచీలకు మాత్రం మాత్రం నిబంధన విధించింది. ఏ బ్రాంచీకి ఎన్‌బీఏ ఉంటే అందులో ఒక సెక్షన్ ఇవ్వనున్నారు. మామూలుగా ఒక సెక్షన్ అంటే 60 సీట్లు కాగా…సగం సెక్షన్ 30 సీట్లు కూడా ఇస్తారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈని కూడా సంప్రదాయ బ్రాంచీగానే పరిగణించనున్నారు. కాగా, వచ్చే విద్యా సంవత్సరం(2021-22) వృత్తి విద్యా కళాశాలలకు అనుమతుల ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలపై హ్యాండ్‌బుక్‌ను ఏఐసీటీఈ విడుదల చేసింది. నూతన నిబంధనలపై అవగాహన పెంచుకునేందుకు బుధవారం దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల యజమానులు, ఇతర ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించింది. మార్గదర్శకాల్లో మార్పులు, చేర్పులపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పీజీ డిప్లొమా ఇన్‌మేనేజ్‌మెంట్ కోర్సును అందించే విద్యాసంస్థలకు ఆయా రాష్ట్ర విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలతో సంబంధం లేదని, ఏఐసీటీఈ పర్మిషన్‌తో కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment