7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త. మూడు విడతలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ను జులై 1, 2021 నుంచి పునరుద్ధరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మంగళవారం నాడు రాజ్యసభలో విపక్షాలు అడిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ పై విధంగా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. మూడు నెలలగా పెండింగ్‌లో ఉన్న సవరించిన రేట్లతో కూడిన డీఏ, డీఆర్‌ను జులై 1, 2021 నుంచి అమలు పరుస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ 19 సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ చెల్లింపులను నిలిపివేశామని తెలిపిన ఆయన దీని కారణంగా 2020 సంక్షోభ సమయంలో ప్రభుత్వం రూ. 37,000 కోట్లకు పైగా ఆదా చేసిందన్నారు. ఆదా చేసిన సొమ్ము కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి సహాయపడిందన్నారు.
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ, పెన్షన్‌దారుల డీఆర్‌ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ ప్రకటించింది. పెంచిన మొత్తం జులై 2020 నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన డీఏ, డీఆర్‌ను ఏప్రిల్ 2021 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక పెంచిన రేట్లతో కూడిన డీఏ, డీఆర్‌ను జులై 2021 నుంచి అమలు చేస్తామని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించారు.
“1-1-2020, 1-7-2020, 1-1-2021 మూడు విడుతల డీఏ, డీఆర్‌ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సి ఉంది. గతేడాది పెంచిన 4శాతం డీఏ, డీఆర్ రేట్లతో కలిపి జులై 2021 నుంచి అమలు చేస్తాం. వాస్తవానికి ఇది 2021 జనవరి 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పెన్షనర్లకు డీఏ, డీఆర్ నిలిపివేశాం' అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
0 comments:
Post a comment