57 మంది వేదపాఠశాలవిద్యార్థులకు కరోనా
తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో 57 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మంగళవారం కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా ఎలాంటి లక్షణాలు లేకపోయినా 57 మంది విద్యార్థులకు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని తితిదే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే వారిని వైద్య చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించి తిరిగి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు చేయించారు. ఫలితాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం వారికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, మిగిలిన 378 మంది విద్యార్థులకు, 35 మంది అధ్యాపకులకు, 10 మంది ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ రిపోర్టు వచ్చిందని అధికారులు తెలిపారు.
♦రాష్ట్రంలో 120 కొత్త కేసులు
🌻ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత 24 గంటల్లో 120 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 48,973 నమూనాలను పరీక్షించారు. చిత్తూరులో కొవిడ్-19తో ఒకరు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 93 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా చిత్తూరులో 35 కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.
♦అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లోనూ కొవిడ్-19 టీకా
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ కొవిడ్-19 టీకా వేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆసుపత్రుల జాబితాను ‘్న‌్రi-.్ణ్న‌్ర.i- వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.
0 Comments:
Post a Comment