📚✍56 మంది విద్యార్థినులకు కరోనా
♦తమిళనాడు తంజావూరు పాఠశాలలో ఘటన
🌻న్యూఢిల్లీ, చెన్నై, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా అమ్మ పేటై గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో 56 మంది పైగా విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. ఓ టీచర్ కి పాజిటివ్ వచ్చింది. ఈ నేప ధ్యంలో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. మరోవైపు దేశంలో శనివారం 25,317 మందికి కరోనా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర (15602) లో వరుసగా రెండో రోజు పాజిటివ్ లు 15వేల పైనే నమోదయ్యాయి. కర్ణాటకలో మరోసారి లాక్ డౌన్ వద్దనుకుంటే ప్రజ లు సహకరించాలని సీఎం యడియూరప్ప కోరారు. మరోవైపు కఠిన లాక్ డౌన్ అమలు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని, ఇదే చివరి హెచ్చరిక అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు.
0 comments:
Post a comment