న్యూఢిల్లీ : ప్రపంచంలో సాంకేతికంగా, ఆర్థికంగా వృద్ధి చెందుతోందని చెప్పుకుంటున్న భారత్‌లో బాల్య వివాహాలు ఇప్పటికీ ఒక సమస్యగానే మిగిలి ఉన్నది. ఒకవైపు 'బేటీ బచావోాబేటీ పడావో' వంటి పథకాలతో దేశంలో బాలికల సంక్షేమానికి కృషి చేస్తున్నామని మోడీ సర్కారు చెప్పుకుంటున్నది. అయితే, ప్రపంచంలో బాల్య వివాహాలు అధికంగా నమోదవుతున్న ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. యూనిసెఫ్ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం వెల్లడైంది. 'కోవిడ్‌ా19 : ఎ త్రెట్ టు ప్రొగ్రెస్ అగైనెస్ట్ చైల్డ్ మ్యారెజ్' నివేదిక ప్రకారం.. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికల వివాహాలు జరుగుతన్న ఐదు దేశాల్లో భారత్ ఒకటి.
ప్రపంచంలో ఇప్పుడున్న 65 కోట్ల మంది బాలికలు, మహిళలకు తమ చిన్నతనంలోనే వివాహాలు జరిగాయి. ఇందులో దాదాపు సగం వరకు బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా దేశాలకు చెందినవే. ఇక సబ్‌ాసహారన్ ఆఫ్రికాలో 35 శాతం మంది మహిళలకు 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే పెళ్లిళ్లు జరిగాయి. బాల్య వివాహాలు జరిగిన వారి సంఖ్య దాదాపు 30 శాతం మందితో దక్షిణాసియా తర్వాతి స్థానంలో ఉన్నది. లాటిన్ అమెరికా, కరెబియన్ లలో 24 శాతం బాల్య వివాహాలు నమోదయ్యాయి. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికాలలో 17 శాతం, తూర్పు యూరప్, మధ్య ఆసియాల్లో దాదాపు 12 శాతంగా ఉన్నాయి.
కోవిడ్ ప్రభావం
కోవిడ్-19 కారణంగా చోటు చేసుకున్న పాఠశాలల మూసివేత, ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల మరణాలు వంటి కారణాలతో బాల్య వివాహాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. 'కరోనా మహమ్మారి ఇప్పటికే బాలికలపై తీవ్ర ప్రభావం చూపింది. వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే, బాల్య వివాహాలు వారి స్వేచ్ఛను హరిస్తాయి. కాబట్టి, వీటిని తప్పక నిర్మూలించాలి. దీనిని మనం చేయగలం'' అని యూనిసెఫ్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ హెన్రియెట్ట ఫోరె అన్నారు.
0 Comments:
Post a Comment