వేగంగా సెకండ్ వేవ్
♦ఠారెత్తిస్తున్న కరోనా 2.0..
♦ఒకేరోజు 35 వేల కొత్త కేసులు.. 172 మరణాలు
♦మహారాష్ట్రలోనే 65 శాతం కేసులు..క్రియాశీల కేసులు 2.5లక్షలకు చేరిక
♦అనుమతివ్వండి.. మూడు నెలల్లో అందరికీ వ్యాక్సిన్ ఇస్తాం: కేజ్రీవాల్
🌻న్యూఢిల్లీ, కరోనా మహమ్మారి మళ్లీ కొరడా రఝలిపిస్తోం ది. శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజువారి కేసులు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న దశలో వైరస్ ఉధృతి పెరగడం భయాందో ళనలను కలిగిస్తోంది. కొత్తగా నమోదయ్యే కేసుల్లో 65 శాతం మహారాష్ట్రలోనే వెలుగు చూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,871 పాజిటిు వెలుగుచూడ గా, ఇందులో 23, 179 కేసులు (84.6శాతం) మహారాష్ట్రలో నేనమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం వెల్లడించిం ది. కొత్త కేసుల్లో 80 శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే బయటపడుతున్నట్లు తెలిపింది, ప్రస్తుతం 2,52,364 యాక్టివ్ కేసులున్నాయని, ఇందులో 1.52లక్షల కేసులు మహారాష్ట్రలోనే ఉన్నట్లు వివరించింది. తాజాగా మరో 172 మంది వైరసకు బలయ్యారు. అత్యధికంగా మహారాష్ట్రలో మంది మరణించారు. రోజువారీ మరణాల్లో 85శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది
♦18 రాష్ట్రాల్లో మరణాల్లేవ్
గడిచిన 24 గంటల వ్యవధిలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. రాజస్థాన్, అసోం, చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, ఝార్ఖండ్, పుదు చ్చేరి, లక్షద్వీప్, సిక్కిం, లడఖ్, మణిపూర్, దాద్రానగర్ హవేలీ దయ్యూదామన్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ లో బుధవా రం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకా లేదని ప్రకటించింది. వ్యాక్సినేషన్ నిబంధనలను సడలిస్తే, మూడు నెలల్లో ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ టీకా పంపిణీ చేస్తా మని ఆ రాష్ట్రసీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి తెలిపారు ఏళ్లు పైబడిన వారందరికీ వాక్ ఇన్ వ్యాక్సిన్ పద్ధతిలో టీకాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
0 comments:
Post a comment