💥1 నుంచి 5 వరకూ స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు: విద్యాశాఖ మంత్రి ఆదేశాలు
బెంగళూరు: కర్నాటకలో విజృంభిస్తున్న కోవిడ్-19 కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలలకు పలు నిబంధనలు జారీ చేసింది. అయితే వీటిని ఉల్లంఘిస్తూ 1 నుంచి 5వ తరగతి వరకూ క్లాసులు నిర్వహిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కర్నాటక విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కర్నాటక రాష్ట్రప్రభుత్వం 1 నుంచి 5 వ తరగతి వరకూ కేవలం ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. అయితే కొన్ని పాఠశాలలు ఈ నిబంధనను ఉల్లంఘించి 1 నుంచి 5వ తరగతి వరకూ ఆఫ్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. కాగా ఇటీవల కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ ఒక ట్వీట్లో.... పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా 1 నుంచి 5 వ తరగతి వరకూ పాఠశాలలు తెరవవద్దని కోరారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్నారంటూ తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రాథమిక తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి వాటిపై చర్యలు చేపడుతున్నారు.
0 comments:
Post a comment