ఏపిటిఎఫ్ అధ్యక్షులు హృదయరాజు కు తప్పిన ప్రమాదం
బస్సు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపిటిఎఫ్ (1938) రాష్ట్ర అధ్యక్షులుహృదయరాజు ప్రయాణిస్తున్న బస్సు మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదానికి గురైంది .కర్నూల్ నుండి విజయవాడ వస్తుండగా గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో ప్రైవేట్ స్లీపర్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. బస్సులో 32 మంది ప్రయాణిస్తున్నారు. ఏపీటీఎఫ్ అధ్యక్షులు హృదయరాజు నడుము వద్ద మోకాలు మోచేతులు కు బాగా దెబ్బలు తగిలాయి. బస్సు డివైడర్ను తట్టుకుని లోయలో పడకుండా ఆగడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు .గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం హృదయ రాజును నంద్యాల లోని శాంతారామ్ జనరల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హృదయరాజు త్వరగా కోలుకోవాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కోరుకుంటున్నారు.
0 comments:
Post a comment