పిల్లల్లో చిన్నప్పటి నుంచే ఆత్మవిశ్వాసం పెంచడం ఎంతో ముఖ్యం. అలాగే వారు ఎంతో ప్రత్యేకమైన వారని, అనుకుంటే ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని వారిలో కల్పించాలి. ఇందుకోసం ఓ టీచర్ పాట రూపంలో కిండర్ కార్టెన్ పిల్లల్లో ప్రతీరోజు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తున్నారు. ప్రతీరోజు ఉదయాన్నే పిల్లలతో ఈ పాటలాంటి ఈ పవర్ఫుల్ మాటలను పలికిస్తున్నారు.
అమెరికా ఓహియోలోని కిండర్గార్టెన్ పాఠశాలలో పని చేస్తున్న మనిక్యూ వాటర్స్ ఇలా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. 'అయామ్ స్ట్రాంగ్, అయామ్ టాలెంటెడ్, అయామ్ స్మార్ట్, అయామ్ సో సో స్పెషల్. ఐ కన్ అచీవ్ ఎనీథింగ్' అని అమె లబయబద్ధంగా పాడుతూ పిల్లలకు బోధిస్తున్నారు.
పిల్లలు సైతం ఎంతో హషారుగా అమెను అనుకరిస్తూ.. ఈ మాటలకు పలుకుతున్నారు. ఈ వీడియోను మానిక్యూ వాటర్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
'ఈ డైలీ అఫిర్మేషన్ నాకు ఎంతో నచ్చింది. మా మార్నింగ్ మీటింగ్లో ప్రతీరోజు ఇది చెబుతాం. రోజులో ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ప్రారంభం అద్భుతంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. మేం ప్రతీరోజు ఈ పాటను పాడతాం. మా పిల్లలు కూడా దీన్ని ఇష్టపడతారు. మీగురించి మీరు బాగా మాట్లాడుకోవాలని గుర్తించుకోండి' అని మోనిక్ వాటర్స్ క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియో వైరల్ కాగా.. టీచర్ మానిక్యూను అందరూ ప్రశంసిస్తున్నారు. అందరు టీచర్లు ఇదే విధానాన్ని పాటించాలని సూచిస్తున్నారు. అమెరికాలోని చాలా పాఠశాలల్లో అఫిర్మేషన్ ఉన్నా.. ఈ టీచర్ మాత్రం పాటలా పిల్లలు ఇష్టపడేలా చెబుతుండడం నెటిజన్లను ఫిదా చేస్తోంది.
View The Video...
0 comments:
Post a comment