Singareni Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక సింగరేణి సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సింగరేణి సంస్థలోనూ మొత్తం 651 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు సంస్థ సీఎండీ శ్రీధర్ వెల్లడించారు.
ఈ ఉద్యోగాలను మార్చిలోపే భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ మొత్తం పోస్టుల్లో 569 మంది కార్మికులు కాగా, 82 మంది అధికారులకు సంబంధించినవని ఆయన వివరించారు. ఆయా పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సీఎండీ తెలిపారు.
అంతర్గత సిబ్బందితో మరో 1436 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్ష, ప్రతిభ ఆధారంగానే ఈ నియమకాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇప్పటివరకు సంస్థలో మొత్తం 13,934 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు శ్రీధర్ తెలిపారు.
0 comments:
Post a comment