ఎస్బీఐలో భారీగా రిటర్న్స్ ఇచ్చే పథకం ఇదే
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉందా? మీరు ఫిక్సెడ్ డిపాజిట్(FD), రికరింగ్ డిపాజిట్(RD), ప్రభుత్వ భవిష్యనిధి(PF), ఉద్యోగుల భవిష్య నిధి(EPF), పోస్టాఫీసు పథకాలు లేదా ఇతర చిన్న పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటారా? అయితే వీటిలో రిటర్న్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణంతో పాటు పన్ను మినహాయింపు కోసం ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తుండవచ్చు. దీర్ఘకాలం పాటు ఎక్కువ రిటర్న్స్ పొందడానికి ఎస్బీఐలో మరో పెట్టుబడి ప్రణాళిక ఉంది. అదే ఎస్బీఐ స్మాల్ క్యాపిటల్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్. ఇందులో పెట్టుబడి పెట్టినవారికి గత ఐదేళ్లలో 22 శాతం రిటర్న్స్ వచ్చాయంటే ఎంత లాభదాయకమైనదో తెలుసుకోవచ్చు. వ్యాల్యూ రిసెర్చ్ పీర్ కమీషన్ రిపోర్ట్ ఎస్బీఐ స్మాల్ క్యాపిటల్ ఫండ్-డైరెక్ట్ ప్లాన్ కు నాలుగు స్టార్ల రేటింగ్ ఇచ్చింది.
అంతే కాకుండా 5 ఏళ్ల కాలంలో 22.23 శాతం రిటర్స్న్ ఇచ్చిన అతి కొద్ది ఆదాయ మార్గాల్లో ఒకటిగా గుర్తించింది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన రిటర్న్స్ ఇచ్చే ప్రణాళికగా గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది కాలంగా ఈ ఎస్బీఐ ప్లాన్ లో పెట్టుబడి పెట్టినవారు 36.41 శాతం రాబడి అందుకున్నారు.
పెట్టుబడుదారులు ఈ పథకంలో ముఖ్యంగా డైరెక్ట్ అనేది పదం గురించి ఆలోచించాలని గురించి సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రెగ్యులర్ ప్లాన్ కు బదులు డైరెక్ట్ ఫండ్ కొనుగోలు చేయడం ద్వారా అధిక రాబడి పొందవచ్చని చెబుతున్నారు. పెట్టుబడి ప్రణాళిక కాలపరిమితి బట్టి 0.5 శాతం నుచంచి 1.5 శాతం రాబడి పెరుగుతుందని స్పష్టం చేశారు. కాబట్టి పెట్టుబడిదారులు ఎలాంటి సందేహం లేకుండా మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్.. ఎవరైనా ఎస్ఐపీలో నెలకు రూ.6000 పెట్టుబడి పెట్టినట్లయితే ఐదేళ్లలో వారి నికర పెట్టుబడి రూ.3.6 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం ఐదేళ్లలో 6.58 లక్షలు రాబడి అందుకుంటారు. ఇతర ఫండ్లలో పెట్టిన పెట్టుబడులకు వచ్చే ఆదాయం కంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రావడం విశేషం.
0 comments:
Post a comment