స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఖాతాదారులకు అలర్ట్. మీ కేవైసీ అప్డేట్గా ఉందా? కేవైసీలో ఏవైనా మార్పులు ఉన్నాయా? మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అడ్రస్, ఇతర వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే బ్యాంకులో అప్డేట్ చేయించారా? బ్యాంకు అకౌంట్ హోల్డర్లు అందరూ కేవైసీ అప్డేట్ చేయించడం తప్పనిసరి. కస్టమర్ల గుర్తింపు కోసం బ్యాంకులు నో యువర్ కస్టమర్-KYC ప్రాసెస్ చేస్తాయి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే కేవైసీ పూర్తి చేస్తుంది బ్యాంకు. అంతేకాదు... అందులోని వివరాలను తరచూ అప్డేట్ చేస్తూ ఉంటుంది. కేవైసీ అప్డేట్ చేయించడానికి కస్టమర్ల దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆ డాక్యుమెంట్స్‌తో కస్టమర్లు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ అప్డేట్ చేయించాలి.
ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. మరి ఎస్బీఐలో కేవైసీ కోసం ఏఏ డాక్యుమెంట్స్ అనుమతిస్తారో తెలుసుకోండి.
SBI KYC Update: ఐడెంటిటీ ప్రూఫ్ కోసం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే
పాస్‌పోర్ట్
వోటర్ ఐడీ కార్డ్
పాన్ కార్డ్
ప్రభుత్వ లేదా డిఫెన్స్ ఐడీ కార్డ్
ప్రముఖ ఎంప్లాయర్స్ నుంచి ఐడీ కార్డ్
డ్రైవింగ్ లైసెన్స్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్
పోస్ట్ ఆఫీసులు జారీ చేసిన ఫోటో ఐడీ కార్డ్
యూజీసీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్-AICTE గుర్తింపు పొందిన యూనివర్సిటీలు విద్యార్థులకు జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డులు
SBI KYC Update: అడ్రస్ ప్రూఫ్ కోసం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇవే
పాస్‌పోర్ట్
డ్రైవింగ్ లైసెన్స్
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ (గత 3 నెలల్లోపుది)
సాలరీ స్లిప్
ఇన్క్యామ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్
ఎలక్ట్రిసిటీ బిల్ (గత 6 నెలల్లోపుది)
ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్ (గత 3 నెలల్లోపుది)
బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్
ప్రముఖ ఎంప్లాయర్ నుంచి లెటర్
పబ్లిక్ అథార్టీ నుంచి లెటర్
రేషన్ కార్డ్
వోటర్ ఐడీ కార్డ్ (ప్రస్తుత అడ్రస్ ఉండాలి)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్
లీజ్ అగ్రిమెంట్, సేల్ డీడ్ లాంటి రిజిస్టర్డ్ కాపీస్
యూనివర్సిటీ, విద్యాసంస్థకు చెందిన రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్, డీన్, హాస్టల్ వార్డెన్ జారీ చేసిన సర్టిఫికెట్.
బంధువులతో ఉంటున్న విద్యార్థులైతే తమ బంధువులకు చెందిన అడ్రస్ ప్రూఫ్స్
సమీప బంధువుల అడ్రస్ ప్రూఫ్.
అకౌంట్ మైనర్ల పేరు మీద ఉంటే ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నవారే ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాలి. ఎన్ఆర్ఐలు తమ పాస్‌పోర్ట్ లేదా రెసిడెన్స్ వీసాలు ఇవ్వాలి. ఖాతాదారులు తమ కేవైసీ అప్డేట్ చేయించేందుకు బ్రాంచ్‌కు వెళ్లాలి. ఆన్లైన్లో అప్డేట్ చేయాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్స్ మాత్రమే ఉపయోగించాలి. ఎవరైనా ఫోన్, ఎస్ఎంఎస్, వాట్సప్, ఇమెయిల్స్ ద్వారా కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని అడిగితే నమ్మకూడదు. ఖాతాదారుల కేవైసీ వివరాలు తెలుసుకొని మోసాలు చేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
0 comments:
Post a comment