ఎపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక పదవి..
పంచాయితీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా వ్యవహరించి, వైసీపి అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా చేసిన ఎపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి( సదరన్ జోన్ జనరల్ కౌన్సిల్) సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఈ పదివికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ప్రభుత్వం గవర్నర్ కు పంపగా అయన పేరును గవర్నర్ నామినేట్ చేయడంతో పెద్దిరెడ్డికిఈ పదవి లభించింది. దక్షిణాది రాష్ట్రాల అభివ్రుద్దికి అత్యంత కీలకంగా వ్యవరిస్తున్న ఈ కౌన్సిల్ లో ప్రతి రాష్ట్రం నుండి సభ్యులు ఉంటారు.
ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించి , కేంద్రం నుండి వస్తున్న నిధులు, డెవలప్ మెంట్ వంటి అంశాల పై ఈ కౌన్సిల్ ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టి పని చేస్తూ ఉంటుంది. ఎపీ తరుపున తనను కౌన్సిల్ సభ్యుడిగా నియమించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు, గవర్నర్ కు పెద్దిరెడ్డి క్రుతజ్నతలు తెలిపారు.
0 comments:
Post a comment