MOST IMPORTANT - MDM INFORMATION
మధ్యాహ్న భోజన పధకం డైరెక్టర్ గారు రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ లో భాగంగా మన జిల్లా లో గల పాఠశాలలు ను ఆకస్మిక తనిఖీ చేసే అవకాశం ఉన్నది. కావున
అందరు ప్రధానోపాధ్యాయులుకు తెలియజేయునది ఏమనగా మీ పాఠశాల కు సంబంధించి
1. ప్రతి రోజు పాఠశాల లో గల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచవలెను.
2. ప్రతిరోజు మధ్యాహ్న భోజన వంటశాల, మరియు తయారు చేసే ప్రదేశం శుభ్రంగా ఉంచే విదంగా చర్యలు తీసుకోవలెను. ముఖ్యంగా గ్యాస్ పైన వంట చేసే విదంగా తెలియజేయవలెను. దీని పైన తగు చర్యలు తీసుకోవలెను. వారికి చెల్లిస్తున్న మీల్స్ కాస్ట్ లో వంటగ్యాస్ కోసం కూడా ఇస్తున్నాం గమనించగలరు.
3. మధ్యాహ్న భోజన *మెనూ చార్ట్* ను నోటీస్ బోర్డ్ లో తప్పనిసరిగా ఉంచవలెను.
4.మధ్యాహ్న భోజనం నిర్వాహకులు వండి వడ్డించేటప్పుడు తలపై *కాప్ (CAP)* తప్పనిసరిగా ప్రతిరోజు ఉండవలెను.
5. డ్రై రేషన్ కు సబందించి అన్ని ఫేస్ లకు సంబందించి రికార్డులను సిద్ధంగా ఉంచవలెను. *డ్రై రేషన్ ఇంకా ఇవ్వవలసిన విద్యార్థులు వివరాలు నోటీస్ బోర్డ్ లో ఉంచవలెను.
6. మధ్యాహ్న భోజనం రోజువారీ నిర్వహణ రికార్డులు ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ రికార్డులు అందుబాటులో ఉంచవలెను.
7. *ప్రతిరోజు IMMS APP లో MDM మరియు SCHOOL SANITATION ల INSPECTION ను తప్పనిసరిగా చేయవలెను.*
*8.మధ్యాహ్న భోజన వివరాలు JAGANANNA GORUMUDDA AND IMMS APP లో తప్పనిసరిగా నమోదు చేయవలెను.*
9. STMF లో బాగంగా *ఆయా నియామకం, టాయిలెట్ నిర్వహణ కమిటీ, టాయిలెట్ నిర్వహణ అకౌంట్* ఈ మూడు విషయాలలో తగు శ్రద్ద వహించి ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేసి అయిన తరువాత వెంటనే *IMMS APP* లో తప్పనిసరిగా నమోదు చేయవలెను.
పై విషయాలలో ఎటువంటి అశ్రద్ధ వహించిన సంబందిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్తి భాద్యత వహించవలసి ఉంటుంది.
అదే విదంగా అందరు ఉప విధ్యాశాఖాదికారులకు మరియు మండల విధ్యాశాఖాదికారులకు తెలియజేయునది ఏమనగా పై విషయం అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేసి తమ పరిదిలో అన్నీ పాఠశాలలులో సక్రమంగా అమలు చేసే విదంగా తగు తక్షణ చర్యలు తీసుకుని నిరంతర పర్యవేక్షణ చేయవల్సినదిగా కొరడమైనది.
AD MDM- AP
0 comments:
Post a comment