🌼ద ఇండియా టాయ్ ఫెయిర్ - 2021
🎯ద ఇండియా టాయ్ ఫెయిర్ - 2021' వర్చువల్ పద్ధతిలో ఫిబ్రవరి 27, 2021 నుండి మార్చి 2, 2021 వరకు నిర్వహించబడుతుంది.
“ఆత్మనిర్భర భారత్” “వోకల్ ఫర్ లోకల్' వంటి అంశాల ప్రచారానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రాంతీయ పరిశ్రమలను ప్రోత్సహించడం ఈ ఫెయిర్ ముఖ్య ఉద్దేశ్యం.
☀️అదేసమయంలో అన్ని వయస్సుల వారు ఆనందంగా విద్యనేర్చుకోవడంలో టాయ్స్ యొక్క ప్రాధాన్యతను పెంచడం.
ఈ ఇండియా టాయ్ ఫెయిర్-2021 యొక్క మరొక ముఖ్య ఉద్దేశ్యం విధాన నిర్ణేతలు, టాయ్స్ ఉత్పత్తి మరియు పంపిణీదారులు,
పెట్టుబడిదారులు, పరిశ్రమనిపుణులు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేవారు,
పిల్లలు, తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులందరిని ఒకే వేదిక పైకి తెచ్చి, భారత టాయ్ పరిశ్రమను ప్రపంచంలో గట్టిపోటీదారుగా నిలపడం.
ఈ టాయ్ ఫెయిర్ ప్రధాన ఆకర్షణ 1000కి పైగా వర్చువల్ స్టాల్స్ ద్వారా వర్చువల్ ప్రదర్శన నిర్వహించడం.
☀️ఈ ప్రదర్శనలో ఆటల ద్వారా విద్యనందిస్తూ, బాల్యాన్ని ఆనందమయం చేస్తున్న భారత వ్యాపారులు, ఎన్ సిఇఆర్టి,
ఎస్ సిఇఆర్డ్, సిబిఎస్ఇ వారి పాఠశాలలు, ఉపాధ్యాయులు. ఐఐటి గాంధీనగర్, ఎస్ఏడి మరియు చిల్డ్రన్ యూనివర్సిటీ
అహమ్మదాబాదు వారు పాల్గొంటున్నారు.
☀️భారత టాయ్ పరిశ్రమలోని చిన్న, పెద్ద ఉత్పత్తిదారులందరూ భారత భిన్నత్వాన్ని తమ ఉత్పత్తుల ద్వారా ప్రదర్శించవచ్చు.
ఈ ప్రదర్శన దేశ నలుమూలల ఉన్న లక్షలాది వినియోగదారులు ప్రదర్శన చూసి కావలసిన టాయ్స్ కొనుగోలు చేసే
అవకాశాన్నిస్తుంది.
☀️ఫిబ్రవరి 8, 2021 నాటికి 1000కి పైగా ప్రదర్శనలు 'ద ఇండియా టాయ్ ఫెయిర్ 2021 లో వర్చువల్ ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నాయి.
☀️భారత టాయ్ పరిశ్రమలోని సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించిన చర్చలు, వెబినార్లు, విజ్ఞాన విషయాలు
కూడా ఈ ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. భవిష్యత్తులో భారత్ టాయ్ పరిశ్రమ సమగ్రాభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, జాగ్రత్తలు గూర్చి చర్చలుంటాయి.
☀️ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించిన చర్చలో ఎపి-2020లో చెప్పబడిన ఆటలు, కృత్య ఆధారిత అభ్యసన,ఇండోర్, అవుట్ డోర్ ఆటలు, క్రిటికల్ థింకింగ్ ను పెంపొందించే పజిల్స్, గేమ్స్ ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తూ
మొత్తంగా అభ్యసనాన్ని ఆకర్షణీయంగాను, ఆనందించేదిగాను ఉంచడం గూర్చి నిపుణులు చర్చించాలి.
☀️ఈకార్యక్రమాలతోపాటు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు టాయ్ ఉత్పత్తిలో మన సమిష్టి కృషిని ప్రదర్శించేలా వెబినార్లు,
సెషన్లు, ఈ వర్చువల్ ప్లాట్ ఫాంపై నిర్వహించాలి.
☀️ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అనేక కృత్యాలు అనగా
కళా ప్రద్శనలు, పోటీలు, క్విజ్లు, వర్చువల్ టూర్లు, నూతన ఉత్పత్తులును ప్రారంభించడం మొ||వి ఈ ఫెయిర్
జరుగుతున్న సమయంలో చేపట్టాలి
•*ఫిబ్రవరి 11, 2021న వెబ్ సైట్ యొక్క రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించబడింది.
లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా ఫిబ్రవరి 27 నుండి మార్చి 2 వరకు వర్చువల్ మోడ్ లో
ఈ టాయ్ ఫెయిర్‌ను అందరూ చూడవచ్చు.
0 comments:
Post a comment