నోటి నుంచి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం మనం తినే ఆహారం దంతాలలో చిక్కుకోవడం. ఇది దుర్వాసనను ఉత్పత్తి చేయడంతో పాటు ముందు ముందు దంత క్షయానికి కూడా దారితీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా నోటి దుర్వాసన సమస్య వస్తుంది. కారణం ఏదైనప్పటికీ.. దుర్వాసన అనేది ఇబ్బందికరమైన సమస్యే. చెడు శ్వాసను తొలగించడానికి సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కొత్తిమీర
నోటి దుర్వాసన చికిత్సలో కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. ఇందులో అధిక స్థాయి క్లోరోఫిల్ ఉంటుంది. ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులను నమలడం ద్వారా దుర్వాసన పోయి తాజా సువాసనను అందిస్తుంది.
పైనాపిల్ రసం
పైనాపిల్ రసం నోటి దుర్వాసనను తగ్గించేందుకు సహాయపడుతుంది. భోజనం తర్వాత పైనాపిల్ ముక్కను నమలడం మంచిది. కాకపోతే ఈ పండ్లలోని చక్కెర పదార్థం ఉంటుంది.. ఇది దంత క్షయం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఇది తిన్నతర్వాత మీ నోరు శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
పెరుగు
పెరుగులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా చెడు శ్వాసకు కారణమయ్యే చెడు బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
లవంగాలు
లవంగాలు క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని లవంగాలు లేదా సోంపు గింజలను నమలడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించవచ్చు.
సిట్రస్ పళ్లు
చెడు శ్వాసతో బాధపడుతున్నవారు నారింజ, నిమ్మకాయ ముక్కలను నమలడం గొప్ప ఆలోచన. ఇవి మీ శ్వాసను తాజాదనానికి నిలయంగా మార్చుతుంది. సిట్రిక్ యాసిడ్ చెడు శ్వాసను దూరంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
దాల్చినచెక్క
దాల్చినచెక్క యాంటీ-సూక్ష్మజీవుల లక్షణాలను కలిగి ఉన్నందున చెడు శ్వాసతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. దీన్ని నమలడం ద్వారా నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడచ్చు.
0 comments:
Post a comment