ఎంపికైన అభ్యర్దులకు ఏపీ ప్రభుత్వ( Ap Government ) సహకారంతో శిక్షణ ఉంటుంది. రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాల్ని https://www.hcltech.com/careers వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. మరో నాలుగేళ్ల వ్యవధిలో విజయవాడ యూనిట్లో ఉద్యోగుల సంఖ్య 5 వేలకు చేరుకోవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో టెక్బీ పేరిట ఎర్లీ కెరీర్ అనే ప్రోగ్రామ్ నడుస్తోంది. ఇంటర్మీడియేట్ 65 శాతం మార్కులతో పాస్ అయినవారు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది పాటు శిక్షణ అనంతరం ఎంట్రీలెవెల్ ఉద్యోగం కల్పించనున్నారు.
మరోవైపు ఉన్నత విద్య చదువుకోవాలనుకునే టెక్బీ స్కాలర్స్‌కు బిట్స్ పిలానీ లేదా యూనివర్శిటీ విద్యాభ్యాసం కోసం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సహకారం అందించనుంది. టెక్బీ ప్రోగ్రామ్ కోసం ఇప్పటికే 750 మంది విద్యార్ధులు ఎన్రోల్ అయ్యారు.
0 comments:
Post a comment