చెన్నై జట్టుకి ఆడుతున్న హరిశంకర్ రెడ్డి చరిత్ర ఇది !!
హరి శంకర్ రెడ్డి… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఈ పేరు. కడప జిల్లాకు చెందిన ఈ యువ ఆటగాడిని ఐపిఎల్ లో మేటి జట్టుగా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ వేలం పాటలో దక్కించుకుంది. 20 లక్షలకు అతనిని కొనుగోలు చేసారు. ఈ వేలం పాటలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలంలో అమ్ముడైన ఆటగాడు హరిశంకర్ రెడ్డి కావడం విశేషం. దీనితో సోషల్ మీడియాలో ఈ యువ బౌలర్ హాట్ టాపిక్ అయ్యాడు.
22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి 8 ఏళ్ళ నుంచే తన ప్రతిభకు పదును పెట్టాడు. 2016 లో అండర్ 19 కి ఎంపిక అయిన ఈ యువ బౌలర్… 2018 లో రంజీల్లో అడుగు పెట్టాడు.
పదునైన బౌలింగ్, స్వింగ్, కచ్చితమైన పేస్ బౌలింగ్ తో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.
రంజీ జట్టులో కూడా అతను తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అగ్ర ఆటగాళ్ళతో అతను డ్రెస్సింగ్ రూమ్ పంచుకుంటాడు. తనను ఐపిఎల్ లో ఎంపిక చేయడంపై అతను హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ధోనీ తో కలిసి ఫోటో దిగితే చాలు అనుకున్నా అని కాని అతనితో కలిసి ఆడే అవకాశం వచ్చింది అని హర్షం వ్యక్తం చేసాడు.
ధోనీ తో కలిసి ఆడటం అద్రుష్టంగా భావిస్తున్నా అని తనను కొనుగోలు చేసిన చెన్నైకి ధన్యవాదాలు చెప్పాడు. అంతర్జాతీయ వేదికపై అతను ఆడటంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా అభినందనలు చెప్పారు. హరి శంకర్ రెడ్డికి ఒక అన్న కాగా అతను కువైట్ లో స్థిరపడ్డారు. ఇక అతని తల్లి తండ్రులు ఇద్దరూ ఇప్పటికి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా వ్యవసాయ కుటుంబం నుంచి క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతను భారత జట్టుకి ఎంపిక కావాలని ఆకాంక్షిస్తున్నారు.
0 comments:
Post a comment