GO.Ms.No.11,Dt.18.02.2021- Modification in SSC Public Examinations, 2021 to reduce the strain caused to the students due to COVID-19 pandemic - Amendment – Orders
✍టెన్త్ పరీక్షల బ్లూ ప్రింట్ విడుదల✍📚
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:* పదో తరగతి పరీక్షల-2021 బ్లూ ప్రింట్ ను
రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. కరోనా వల్ల పూర్తిస్థాయిలో తరగతులు జరగకపోవడం వల్ల 11 పేపర్లను ఏడుకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ తగ్గింపునకు అనుగుణంగా బ్లూ ప్రింట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జిఓ 69కు సవరణలు చేస్తూ జిఓ 11ను పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. మొత్తం 100 మార్కుల పేపర్లో 33 ప్రశ్నలు ఉంటాయి. 2.30 గంటలకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఆబ్జెక్టివ్ మాదిరి ప్రశ్నలు 12 మార్కులకు ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. స్వల్ప కాలిక ప్రశ్నలు 8 ఉంటాయి. ఒక్కో సమాధానానికి రెండు మార్కుల చొప్పున మొత్తం 16 మార్కులు కేటాయించారు. షార్ట్ ఆన్సర్స్ ప్రశ్నలు 8 ఇస్తారు ఒక్కో సమాధానానికి 4 మార్కుల చొప్పున మొత్తం మార్కులకు ఇవి ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు 5 ఉంటాయి. ఒక్కో సమాధానానికి 8 మార్కుల చొప్పున మొత్తం 40 మార్కులకు ఇవి ఉంటాయి. సైన్సు మినహా మిగిలిన ఐదు సబ్జెక్టుల పేపర్లు ఇలానే ఉంటాయి. ఫిజికల్ సైన్స్, జనరల్ సైన్స్ పేపర్లు పాత విధానంలో ఉంటాయి.
0 comments:
Post a comment