కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. ఎక్స్-ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cisf.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది.
అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.
CISF recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 2000
ఎస్సై- 63
ఏఎస్సై- 187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326
CISF recruitment 2021: వేతనాల వివరాలు ఇవే...
ఎస్సై- రూ.40,000
ఏఎస్సై- రూ.35,000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.25,000
CISF recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
అర్హతలు- ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం- ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వయస్సు- 50 ఏళ్ల లోపు
0 comments:
Post a comment