అమరావతి: మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ రమేశ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్లు వేసి చనిపోయిన వారి స్థానాల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు అనుమతించారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 28న నామినేషన్, మార్చి 1న స్క్రూటిని, మార్చి 3న ఉపసంహరణ, అదే రోజు తుది జాబితా, 10న పోలింగ్ నిర్వహించనున్నారు. వైసీపీ నుంచి 28, టీడీపీ 17, బీజేపీ 5, సీపీఐ 3, కాంగ్రెస్ 2, జనసేన నుంచి ఒకరు నామినేషన్ వేసి మరణించినట్లు ఎస్ఈసీ ప్రకటించారు.. పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
0 comments:
Post a comment