ఒకే దేశం.. ఒకే పన్ను, ఒకే దేశం.. ఒకే రేషన్.. అంతే కాదు.. ఒకే దేశం.. ఒకే ఎన్నికపై కూడా జోరుగా చర్చ సాగుతోంది.. అదుగో జమిలి.. ఇదిగో జమిలి.. ఈ సారి పక్కా అంటూ అంచనాలు వేస్తూనే ఉన్నారు. ఇక, అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు కూడా ఎప్పుడైనా జమిలి ఎన్నికలు రావొచ్చు అనే అంచనాలతో.. తమ పనుల్లో వేగాన్ని పెంచుతున్నాయి. మరోవైపు సందర్భాను సారం.. ఇప్పటికే పలు సార్లు జమిలిపై మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. అయితే, జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది... ప్రధాని నరేంద్రమోడీ గత కొంత కాలంగా జమిలి ఎన్నికల అంశాన్ని తరచూ లేవనెత్తుతుతుండగా.. లోక్ సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన అత్యంత కీలక దశకు చేరింది. జమిలిపై తన ప్రతిపాదలను ప్రస్తుతం లా కమిషన్ కు సిఫారసు చేసింది కేంద్ర సర్కార్.. ఈ ప్రతిపాదన అమలు చేయదగ్గ రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా న్యాయ కమిషన్ను సూచించినట్టు లోక్సభకు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం.
one nation...one election.....one welfare policy should be the slogan of the country.....
ReplyDelete