పాఠశాల విద్య కమిషనర్ అకస్మిక తనిఖీ..
🔰రికార్డులు లేకపోవడంపై ఆరా!
గుంటూరు(విద్య), ఫిబ్రవరి1:
🔰పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు సోమవారం రూరల్ మండలం చినకోండ్రుపాడు జడ్పీ స్కూల్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన పాఠశాలకు రాగా దాదాపు విద్యార్థులు అందరూ అప్పటికే ఇంటిబాట పట్టారు. పాఠశాల రికార్డుల గురించి ఆయన ఆరాతీయగా అవి అందుబాటులో లేవని ఉపాధ్యాయులు చెప్పారు. పీఈటీలు మూడునెలల నుంచి ఓడీల పేరుతో గైర్హాజరౌతున్నారని ఫిర్యాదు లు అందాయి. దీంతో ఈ విషయంపై డీఈవోతో మాట్లాడతానని ఆయన ఉపాధ్యాయులకు చెప్పారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని లేని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాడు-నేడు కింద జరిగిన పనుల్ని ఆయన పరశీలించారు.
0 comments:
Post a comment