నిమ్మగడ్డకు షాక్.. ఆ యాప్ నిలిపేస్తూ ఆదేశాలిచ్చిన హైకోర్ట్!
అమరావతి: ఈ-వాచ్ యాప్‌పై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన ఈ-వాచ్ యాప్‌ను 9వ తేదీ వరకు ఆపరేట్ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ-వాచ్ యాప్‌కు సెక్యూరిటీ డేటా సర్టిఫికెట్ కోసం గురువారమే దరఖాస్తు చేశారని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. అనుమతి ఇచ్చేందుకు 5 రోజులు పడుతుందని ఏపీటీఎస్ చెప్పింది. ఈలోపు యాప్‌ను పరిశీలించాలని ఏపీటీఎస్‌కు ధర్మాసనం సూచించింది.
సెక్యూరిటీ పరిశీలన లేకుండా యాప్‌ను ఉపయోగించడానికి వీల్లేదని పిటిషనర్లు కోరారు. ప్రభుత్వ యాప్ ఉండగా ఈ యాప్‌ను ఎందుకు చేశారని పిటిషనర్లు ప్రశ్నించారు. ఎస్ఈసీకి ఒక యాప్‌ను రూపొందించుకునే అనుమతి భారత ఎన్నికల సంఘం ఇచ్చిందని ఎన్నికల కమిషనర్ న్యాయవాది స్పష్టం చేశారు.
గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా ఇలా తయారు చేసిందని న్యాయవాది వెల్లడించారు. ఈ నెల 9కి విచారణ వాయిదా పడింది. అప్పటి వరకు యాప్‌ను వినియోగించవద్దని ఎన్నికల కమిషన్‌కు హైకోర్టు ఆదేశించింది.
0 comments:
Post a comment