భారతీయులు దాదాపు ప్రతీ వంటకంలో ఉల్లిపాయలను ఉపయోగిస్తారు. వీటిని చాలా మంది పచ్చిగా కూడా తింటారు. ముఖ్యంగా మిర్చీ, బజ్జీల్లాంటి స్నాక్ ఐటమ్స్ తో వీటిని జత చేసుకుని తినేవారు ఎక్కువ మంది ఉన్నారు. అయితే కూరలు, ఇతర ఆహార పదార్థాలకు మంచి రుచిని అందించడంతో పాటు.. వీటిని తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..!
ప్రతి ఒక్కరి ఆహారంలో ఉల్లిపాయ తప్పనిసరిగా ఉండాలి. రోజూ ఉల్లిపాయలు తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతో పాటు నివారణ కూడా ఉంటుంది. ఇవే కాదు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఆంజినా, జలుబు, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యం కూడా ఉల్లిపాయలకు ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్‌ను తగ్గిస్తాయా..
ఉల్లిపాయలు చాలా శక్తివంతమైనవి. వీటిలో క్యాన్సర్ వ్యాధిని నివారించే లక్షణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో లభించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ క్వెర్సెటిన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. క్వెర్సెటిన్ క్యాన్సర్ వ్యాప్తిని ఆపేయడమే కాక.. తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర ప్రేగు అభివృద్ధిని నివారించడానికి ఈ యాంటీఆక్సిడెంట్ బాగా పనిచేస్తుంది.
ఉల్లిపాయలు బలమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసి.. శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి పనిచేస్తుంది. సెల్యులార్ జీవక్రియలోని రసాయన ఉపఉత్పత్తులు ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వాటిని నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉంది. ఉల్లిపాయలు పూర్తిగా క్యాన్సర్ ను తగ్గించపోయినా.. చికిత్సతో పాటు నివారణలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకూ మీ ఆహారంలో ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవడం మంచిది.
0 comments:
Post a comment