సంతకం చేసి ఇచ్చిన ఖాళీ చెక్కు చెల్లకపోయినా శిక్ష : సుప్రీం కోర్టు
సంతకం చేసి ఇచ్చిన ఖాళీ చెక్కు చెల్లకపోయినా శిక్షార్హమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ బుధవారం తీర్పు చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన బెంచ్ తెలిపింది. ఓ కేసులో బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి రూ.11.50 లక్షల మేరకు బాకీ ఉన్నానని నిందితుడు కళామణి అనే వ్యక్తి ఒప్పుకున్నారని చెప్పింది. కళామణి ఇచ్చిన చెక్కు, హామీ పత్రంపై సంతకాలు ఒకే రకంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. అయితే, నిందితుడు ముందుగానే కోర్టుకు చెల్లించాల్సిన మొత్తాన్ని డిపాజిట్ చేసినందువల్ల శిక్ష విధించనక్కర్లేదని తెలిపింది.
0 comments:
Post a comment