బడ్జెట్: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం షాక్
వ్యవసాయానికి మౌళిక వసతులకు పెద్ద పీట వేసిన కేంద్రం తాజా బడ్జెట్ లో పన్నులు కట్టే సామాన్యులు ఉద్యోగుల మొరను మాత్రం ఆలకించలేకపోయింది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021-22ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈసారి డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ను సమర్పించారు. అనంతరం ట్యాబ్ లో చూసి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.దేశంలో మెజార్టీ పన్నులు చెల్లించే ఉద్యోగులున్నారు. వారు ఎంతో ఆశగా బడ్జెట్ వైపు చూశారు. కానీ ఆదాయపు పన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చింది.
ఇక సీనియర్ సిటిజన్లకు మాత్రం కేంద్రం ఊరట కల్పించింది.
75 ఏళ్లు దాటిన సిటీజన్లకు ఐటీ రిటర్న్ దాఖలకు కేంద్రం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. పింఛను వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం తాజా నిర్ణయంతో పింఛను వడ్డీ తో జీవించే వారికి ఐటీ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపు లభించనుంది.
ఇక పన్ను వివాదాల నివారణకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఆర్తిక మంత్రి ప్రకటించారు. రూ.50లక్షల లోపు ఆదాయం 10 లక్షలలోపు వివాదాలు ఉన్న వారు నేరుగా కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 6.48 కోట్లకు చేరిందని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
0 comments:
Post a comment