కర్నూలు జిల్లా: ఏపీవో సురేష్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
కర్నూలు జిల్లా: 14 మండలాల్లో మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పల్లె వాసులు ఉత్సాహం చూపుతున్నారు. ఉదయం 10 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదయింది. ముందు మందకొడిగా పోలింగ్ జరిగినా.. తర్వాత పుంజుకుంది. నందికొట్కూర్ మండలం, మల్లెలగ్రామంలో ఏపీవో సురేష్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా బంధువుల ఇంట్లో రాత్రి బస చేయడంతో జిల్లా కలెక్టర్ అతనిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నందికొట్కూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో ఫ్యాక్షన్ ప్రభావిత పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, గట్టి నిఘా పెట్టారు. పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
0 comments:
Post a comment