పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ యాప్‌ను విడుదల చేశారు. యాప్ తయారీకి రిలయన్స్ జియో సంస్థ సహకారం తీసుకున్నట్లు, రూ.5లక్షలు ఖర్చు చేసినట్లు ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబు తెలిపారు. మరి ఈ యాప్ ప్రత్యేకత, పనితీరు వంటి విషయాలను తెలుసుకుందామా..!
- గురువారం నుండి గుగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- ఇన్ హౌస్‌లోనే మొబైల్ అప్లికేషన్ ఉంటుంది.
- ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు.
- చేసిన ఫిర్యాదు ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం లేదు.
ు ముందుగా కాల్ సెంటర్‌కు తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు వెళ్తుంది.
- డబ్బు, మద్యం పంపిణీ, లౌడ్ స్పీకర్లు, ఉద్యోగుల విధుల్లో అలసత్వం తదితర అంశాలపై ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదు దారు ఫొటోలు, వీడుయోలు 5ఎంబీ వరకూ పంపవచ్చు.
- ప్రతి కంప్లైంట్‌కు సంఖ్య ఇచ్చి వెరిఫై చేస్తారు. తన ఫిర్యాదుపై సమాచారాన్ని కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు దారు తెలుసుకునే అవకాశం ఉంది.
- ఫిర్యాదుదారు సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఫిర్యాదు చేసుకునే సదుపాయమూ ఉంది.
- ముఖ్యమైన ప్రతి ఫిర్యాదును ఎస్ఈసీ పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు.
- సీరియస్ ఫిర్యాదు అయితే వెంటనే.. మిగిలినవి గరిష్టంగా 3 రోజుల్లో పరిష్కారిస్తారు.
- దీనితో పాటు ఎఈసీ ఏర్పాటు చేసిన కంప్లైట్ సెల్ కూడా అందుబాటులో ఉంటుంది.
- ఎస్ఈసీ కంప్లైట్ సెల్ తో పాటు కాల్ సెంటర్ సమన్వయం ఉంటుంది.
- కంప్లైట్ చేసిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
- వెబ్‌సైట్‌గానూ, మొబైల్ యాప్‌గానూ ఈ యాప్ పనిచేస్తుంది.
0 comments:
Post a comment