📙✍️ఉద్యోగ సంఘాల భేటీలో ఇవే చర్చనీయాంశాలా?
👉ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఆదిత్యనాథ్ దాస్ ఆధ్వర్యంలో సాయంత్రం జరగనున్న భేటీలో దాదాపు పదికి పైగా అంశాలు చర్చకు రానున్నాయని తెలిసింది. వీటితో పాటు అక్కడికక్కడ ఉద్యోగ సంఘాలు ప్రస్తావించే మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, ఉద్యోగ సంఘాల ప్రతిపాదన మేరకు ఈ కింది అంశాలు ఎజెండా అంశాలుగా ఉండే అవకాశం ఉందని సమాచారం.
👉 ప్రధానంగా అన్ని సంఘాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు అంశం చర్చకు తీసుకొస్తాయి.
🔶️కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ దశలవారీగా చేయాలన్న విషయాన్ని పట్టుబట్టనున్నాయి
🔷️ఉద్యోగుల పిఆర్సి పైన చర్చ.
🔶️మహిళా ఉద్యోగుల మెటర్నటీ లీవ్ ఆరు నెలలకు పెంపునకు ప్రతిపాదన
🔷️ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
🔶️జిపిఎఫ్ పెన్షనర్ల బకాయిలు
🔷️నాలుగో తరగతి ఉద్యోగులకు వయసు 60 నుంచి 62 పెంచాలి
🔶️ వీఆర్వోల ప్రమోషన్లు, వీఆర్ఎల ప్రమోషన్లు
ఎంపీడీవోల ప్రమోషన్లు
🔷️ మహిళలకు ఐదు రోజులు స్పెషల్ లీవ్
🔶️ మార్కెటింగ్ మరియు గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు జీతాలు
0 comments:
Post a comment