📚✍ఐదుగురు ఉపాధ్యాయులపై చర్యలు
🌻ఈనాడు, గుంటూరు: ఉపాధ్యాయుల బదిలీల్లో భార్య, భర్తల (స్పౌజ్) కోటాలో ఐదుగురు ఉపాధ్యాయులు ఉద్దేశపూర్వకంగా ఐచ్ఛికాలు పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడినట్లు నిగ్గు తేల్చారు. దీంతో బాధ్యులైన సదరు ఉపాధ్యాయులపై అభియోగాలు (ఛార్జెస్ ఫ్రేమ్) నమోదు చేసి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని గుంటూరు జోన్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు రవీంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం రాత్రి డీఈవోను ఆదేశించారు. ఈ పరిణామం ఉపాధ్యాయవర్గాల్లో అలజడి రేపింది. ఇటీవల ముగిసిన బదిలీల్లో పలువురు ఉపాధ్యాయులు నిబంధనలు ఉల్లంఘించారని జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు వచ్చాయి. మొత్తం 90 రాగా వాటిల్లో 77 తాము ఆప్షన్లు సక్రమంగా పెట్టుకున్నా దూరం ప్రాంతం బదిలీ చేశారని, న్యాయం చేయాలని కోరడంతో వాటిపై విచారణ చేసి వాటిల్లో విద్యాశాఖ పరంగా ఎలాంటి తప్పిదం లేదని తెలుసుకున్నారు. భార్య, భర్తలైన ఎనిమిది మంది ఉపాధ్యాయులు వారిద్దరూ ఒకే మండలంలో పనిచేయటం లేదని పొరుగు మండలాల్లో పని చేస్తున్నారని అప్పీళ్లు రాగా వాటిపై విచారణ చేపట్టిన అధికారులు వారిద్దరూ పనిచేసే పాఠశాలలకు దూరం కేవలం ఒకటి, రెండు కిలోమీటర్ల మాత్రమే ఉందని మండలం మారినా తప్పులేదని వారి ఆప్షన్లు సక్రమంగానే ఇచ్చుకున్నారని గుర్తించి మినహాయించారు. మిగిలిన ఐదుగురు స్పౌజ్కోటాలోనే అక్రమాలకు పాల్పడ్డారు. వీరి అక్రమాలు విద్యాశాఖ విచారణలో నిజËమని తేలాయని వారిపై చర్యలకు ఆదేశించినట్లు ఆర్జేడీ రవీంద్రనాథ్‌రెడ్డి ధ్రువీకరించారు. ఈ కేసులకు సంబంధించి ’భార్య, భర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు కాదు. వేర్వేరు శాఖలకు చెందిన వారున్నారు. అయినా స్పౌజ్ కోటాలో పాయింట్లు పొందినట్లు గుర్తించారు. తాడికొండలో భర్త పనిచేస్తుండగా ఆ మండల పరిధిలో కాకుండా చుండూరులో ఒకరు బదిలీ ఆప్షన్ ఇచ్చుకున్నారు. మరొకరు బొల్లాపల్లి మండలంలో పనిచేస్తూ వినుకొండలో ఆప్షన్ పెట్టుకున్నారు. మరో ఉపాధ్యాయురాలు భర్త సత్తెనపల్లిలో పనిచేస్తుండగా దుగ్గిరాల కోరుకున్నారు. మరో ఇద్దరు కూడా వేర్వేరు మండలాలు ఎంపిక చేసుకున్నారని ఆర్జేడీ తెలిపారు. వీరిపై తొలుత అభియోగాలు నమోదు చేసి తర్వాత క్రమశిక్షణ చర్యలు చేపడతామని చెప్పారు. వీరి వివరాలను కమిషనర్‌కు తెలియజేస్తామని అక్కడి ఆదేశాలతో సస్పెన్షన్ కూడా చేయటానికి అవకాశం ఉందన్నారు.
0 comments:
Post a comment