*📚✍ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో తీపికబురు
♦పీఆర్ సీ ప్రకటనపై ప్రభుత్వం తుది కసరత్తు
🌻అమరావతి, ఆంధ్రప్రభ:
పీఆర్ సీ ప్రకటన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. అయితే పీఆర్ సీ నివేదిక ప్రకారం దాదాపు 30 శాతం ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగసంఘాలు కోరినట్లు సమాచారం. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో నూతన పీఆర్సీ అంశాన్ని ఉద్యోగులు లేవనెత్తగా సీఎస్ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో త్వరలో ఉద్యోగులకు ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనున్నట్లు ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి.
0 comments:
Post a comment