ఈ మధ్య ఎవర్ని ఏ చిన్న మాట కూడా అనలేని పరిస్థితి వచ్చింది. మంచికి ఏ మాట చెప్పిన సరే దానిని కోపంగా తీసుకొని అఘాత్యాలకు పాల్పడుతున్నారు. చిన్న చిన్న వాటికీ కూడా జీవితం మీద విరక్తి చెందుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్కూల్ లో టీచర్స్ తోటి విద్యార్థుల ముందు అవమానించారని 9 వ తరగతి చదివే విద్యార్థి ఆత్మహత్య యత్నం చేయడం సంచలనంగా మారింది. చింతలపూడి సుబ్బరాజు ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.
9వ తరగతి చదివే విద్యార్థిని తనను టీచర్స్ అవమానించారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన ఇంట్లో ఉన్న మాత్రలు మింగేసింది. వెంటనే అప్రమత్తమైన తల్లి..
బాలిక నోట్లో నుంచి మాత్రలు బయటకు తీసేసింది. అయితే, అప్పటికే ఆ మాత్రల ప్రభావం వల్ల సదరు బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రులు బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు సకాలంలో వైద్యం అందించడంతో బాలిక క్షేమంగా ఉంది.
0 comments:
Post a comment