విద్యార్థుల విషయంలో దేశం ముందున్న రెండు సవాళ్లు.. ఇప్పుడు భారత్‌కు కావాల్సిందిదే
అనురాగ్ బెహర్, సీఈఓ - అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ (https://www.firstpost.com/ కోసం రాసిన వ్యాసం)
దేశంలో ఏడాది నుంచి స్కూళ్లు మూసి ఉన్నాయి. సుమారు 260 మిలియన్ల మంది విద్యార్థులు ఈ స్కూళ్లలో ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల స్కూళ్లు తెరిచారు. కానీ, పెద్ద తరగతుల విద్యార్థులకు మాత్రమే. ఓ రకంగా చెప్పాలంటే ఏడాదిగా స్కూళ్లు మూసి ఉన్నట్టే. కానీ, ఈ మూసి ఉన్న కాలంలో రెండు రకాలుగా విద్యాబోధన జరిగింది. ఒకటి, ఆన్ లైన్ క్లాసులు. రెండోది, బహిరంగ ప్రదేశాల్లో మొహల్లాల్లో విద్యాబోధన. ఎంత చెప్పినా.. రోజూ స్కూళ్లలో పాఠాలు చెప్పేదానికి ఇవి ఏ మాత్రం సరిపోవు. ఆన్ లైన్ పాఠాల వల్ల ప్రాధమికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి.
చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు వినేంత ఆర్థిక, మౌలిక సదుపాయాలు లేవు. కానీ, సహజంగా స్కూల్లో టీచర్ ఎదురుగా చెప్పే పాఠాల వల్ల ఒరిగే ప్రయోజనం ఈ ఆన్ లైన్ క్లాసులతో ప్రభావం అంతగా ఉండదు. కానీ, కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులు వినే వారి సంఖ్య అత్యంత భారీగా మాత్రం పెరిగింది. ఇక ఆన్ లైన్ క్లాసులు కూడా నవంబర్ , డిసెంబర్ మధ్య నుంచి ప్రారంభించారు. అంటే అప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది. ఇక మొహల్లాల విషయానికి వస్తే అక్కడ కూడా క్లాసులు చెప్పారు. కానీ, అది వారానికి ఏ నాలుగైదు గంటల్లో చెప్పారు. అదే స్కూళ్లలో అయితే రోజుకు 6 గంటలు పాఠాలు ఉంటాయి.
విద్యార్థులు రెండు రకాలుగా నష్టపోతున్నారు. ఒకటి, 2020 - 21 సంవత్సరంలో నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేకపోయారు. రెండోది, 2020లో స్కూళ్లు మూసేటప్పుడు వారికి తెలిసిన విషయాలు ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. మొదటి రకమైన నష్టం పూడ్చలేనిది. ఒక నాలుగో తరగతి విద్యార్థి ఆన్ లైన్ క్లాసులు చదువుతున్నాడనుకోండి. ఆ విద్యార్థి, నాలుగో తరగతి విద్యార్థి నేర్చుకోవాల్సినంత జ్ఞానాన్ని ఆన్ లైన్ క్లాసుల ద్వారా సంపాదించలేడు. ఇక రెండో రకమైన నష్టాన్ని మనం పూడ్చుకోవచ్చు. ఒక నాలుగో తరగతి విద్యార్థి ఆన్ లైన్ క్లాసుల వల్ల తాను, అంతకుముందు క్లాస్ రూమ్‌లో మూడోతరగతిలో చదివిన అంశాలను మర్చిపోయి ఉండవచ్చు. కానీ, మనం దీన్ని పునరుద్దరించవచ్చు.
సర్వే సారాంశం
స్కూళ్లు తెరిచిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే, మొదటగా వాళ్లు ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్పించడం, ఆ తర్వాత అంతకు ముందు క్లాసుల్లో వారు మర్చిపోయిన అంశాలను పునశ్చరణ చేయించడం. దీనిపై మేం దేశంలోని 44 జిల్లాల్లో సర్వే నిర్వహించాం. 16,067 మంది వద్ద నుంచి శాంపిల్స్ సేకరించాం. 2000 మంది టీచర్లు కూడా ఇందులో సాయం చేశారు. 400 మంది మా టీమ్ దీనిపై చాలా శ్రమించి సర్వే చేసింది. ఆ సర్వే సారాంశం ఏంటంటే.. ఇది కచ్చితంగా దృష్టిసారించాల్సిన అంశం.
2020 మార్చిలో వారికి వచ్చిన వాటిలో.. 82 శాతం మంది లెక్కల్లో ప్రాధమికమైనవి (ఫండమెంటల్స్) కూడా మర్చిపోయారు. 92 శాతం మంది భాషలో ప్రాధమిక అంశాలు మర్చిపోయారు. ఆ తర్వాత క్లాసుల్లో నేర్చుకోవడానికి పునాదిగా ఉండే అంశాలను కూడా వారి మెదడు నుంచి చెరిగిపోయాయి. చాలా మంది విద్యార్థులు కూడికలు, తీసివేతలు మర్చిపోయారు. ఒక పారాగ్రాఫ్ చదవడం చాలా మందికి ఇప్పుడు వీలుకావడం లేదు. ఆ సర్వేకు సంబంధించిన డిటెయిల్స్ చూడండి.
సర్వే సారాంశం
మనకి దేశవ్యాప్తంగా దీనికి సిస్టమ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పెద్ద చాలెంజ్‌ను ఎదుర్కోవడానికి మనం చాలా చేయాలి. దీన్నుంచి బయటపడడానికి టీచర్లకు సరిపడినంత సమయం ఇవ్వాలి. విద్యార్థులు కోల్పోయిన దాన్ని మళ్లీ వారికి నేర్చుకోగలిగేలా చేయాలి. 2021 విద్యాసంవత్సరాన్ని పెంచాలి. వేసవి సెలవులు రద్దు చేయాలి. సిలబస్‌లో అంత ముఖ్యమైనది కాదనిపించిన దాన్ని తీసేయాలి. లేదా ఆ సిలబస్ భాగాన్ని తర్వాత తరగతికి బదిలీ చేయాలి. వారికి సరిపడినంత సమయం లేకపోతే దీన్ని సాధించడం సులభం కాదు. టీచర్లు, విద్యార్థులకు సరిపడినంత సపోర్టు అందించాలి. టీచర్లకు అవసరమైన ట్రైనింగ్, కొన్ని టూల్స్, ప్రతి స్టూడెంట్ను మెరుగ్గా తీర్చగలిగేలా చేయాలి.
260 మిలియన్ల మంది విద్యార్థులు ఈ ఏడాదిలో కోల్పోయిన దానిపై దృష్టిపెట్టకపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత అది విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది. సమాజంలో వారికి ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ ఛాలెంజ్‌ను ఎదుర్కోవడానికి దేశానికి కావాల్సింది 'పెద్ద దేశం - భారీ మిషన్'.
The author is the CEO of Azim Premji Foundation, Chief Sustainability Officer of Wipro Limited and Vice Chancellor, Azim Premji University.
0 comments:
Post a comment